ఆ నిర్మాత బాగా ఇబ్బంది పెట్టాడట

81
- Advertisement -

‘జయం’ సినిమాతో సినీ పరిశ్రమలో హీరోయిన్ గా సదా అడుగుపెట్టింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా పలు హిట్ చిత్రాల్లో సదా నటించి మెప్పించింది. ఐతే, గత వారం సదా తన పెళ్లి పై కామెంట్స్ చేసి వైరల్ అయింది. ప్రస్తుతానికి సదా వయసు 39 ఏళ్లు. నలభైలోకి అడుగు పెడుతునప్పటికీ సదా పెళ్లి చేసుకోవడం పై ఆసక్తి చూపించడం లేదు. అందుకే, ఆమె తన పెళ్లి పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. అయితే, తాజాగా ఓ తమిళ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సదా మరోసారి సంచలన కామెంట్స్ చేసింది. తాను గతంలో తమిళ సినీపరిశ్రమలో ఎదుర్కొన్న క్యాస్టింగ్‌ కౌచ్‌ అనుభవాన్ని సదా మొహమాటం లేకుండా ఓపెన్ గా వెల్లడించింది.

ఇంతకీ సదా ఏం మాట్లాడింది అంటే.. ‘ఆ రోజుల్లో ఒక హీరోయిన్ అనగానే ఆమె పై అందరి చూపు ఉంటుంది. నిర్మాత దగ్గర నుంచి ఆఫీస్ బాయ్ వరకూ అందరికీ హీరోయిన్ అంటే అదే అభిప్రాయం ఉంటుంది. స్టార్ ఇమేజ్ వచ్చినా.. హీరోయిన్ పై చూపులు మారవు. నా సినీ కెరీర్ లో కూడా నేను ఎన్నో చూశాను. ఒక్కోసారి ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానని ఫీల్ అయ్యేదాన్ని. ఆ సమయంలోనే నేను ఒక నిర్మాతను కలిశాను. మొదటి మీటింగ్ లోనే అతడు.. చెప్పిన మాట విని షాకయ్యాను. మా ఆవిడ ఊరిలో లేదు. రేపు నైట్ మీరూ మా ఆవిడ పాత్రలో జీవించాలి అంటూ ఆ నిర్మాత నాతో డైరక్ట్ గా చెప్పేశాడు.

Also Read:హాలీవుడ్ నటుల సమ్మెబాట..

ఆ నిర్మాత అలా చెప్పడంతో నేను వణికిపోవడంతో పాటు పెద్దగా ఏడ్చాను. అనంతరం ఆ నిర్మాత సినిమాలో కూడా నేను నటించలేదు. దాంతో ఆ నిర్మాత నా పై పగ బట్టాడు. నా పై తప్పుడు వార్తలు రాయించే వాడు. నా పెళ్లి సీక్రెట్‌గా జరిగిపోయిందని.. నేను ఓ వ్యక్తితో మూడేళ్లుగా డేటింగ్ చేస్తున్నానని ఇలా చాలా రకాలుగా నన్ను అతను ఇబ్బంది పెట్టాడు అంటూ సదా ఎమోషనల్ అవుతూ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

Also Read:ప్చ్.. ‘బేబీ’ రేటింగ్స్ కొనేసిందా?

- Advertisement -