రష్మిక అందాలకు అడ్డు లేదు

18
- Advertisement -

యానిమల్ సినిమాతో రష్మిక మందన్నా ఆలోచన విధానం కూడా మారిపోయినట్టు ఉంది. రోజురోజుకు ఎక్స్ పోజింగ్ లో పరిధులు చెరిపేసుకుంటూ పోతుంది. సహజంగా సౌత్ హీరోయిన్స్ ముంబైలో కాలు పెట్టగానే బాలీవుడ్ నీళ్లు వంటబట్టేస్తాయి. సౌత్ లో గ్లామర్ చూపించేందుకు హద్దులు గీసుకుని ఉంటారు. రష్మిక మందన్నా కూడా అలాగే ఫోజులు కొట్టింది. కానీ, నార్త్ కి వెళ్ళగానే తన అందాలన్నీ చూపించేస్తోంది. గతంలో శ్రీయా, ఇలియానా, తమన్నా లాంటి వారు అదే చేసారు. ఇప్పుడు రష్మిక మందన్నా వంతు వచ్చింది.

సౌత్ లో రష్మిక మందన్నా ఎంతోకొంత పద్దతిగా కనిపించేది. కానీ, హిందీలోకి వెళ్లిందో లేదో.. అక్కడి హీరోయిన్స్ కి పోటీగా అందాలు ఆరబోస్తుంది. పైగా ఆ మధ్య ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతూ కనిపించింది. అది కూడా టూ గ్లామర్ షో చేస్తూ. ఓ సినిమా షూటింగ్ కోసం ముంబై కి ఎంటర్ అయిన రష్మిక మందన్నా, ప్రస్తుతం అక్కడే సెటిల్ అయ్యే ఏర్పాట్లలో ఉంది. ఎలాగూ యానిమల్ రూపంలో భారీ హిట్ వచ్చింది కాబట్టి, ఇక తనకు ఎదురే లేదు అనే భ్రమలో ఉంది రష్మిక పాప.

షాహిద్ కపూర్ తో కలిసి ఓ చిత్రంతో రష్మిక మందన్నాఆడియన్స్ ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమాలో ఎలా కనిపిస్తోందో చూడాలి. సరే, సినిమాలో ఎలా కనిపించినా.. ఈ మధ్య సోషల్ మీడియాలోనూ.. కొన్ని యాడ్స్ ప్రమోషన్స్ లోనూ రష్మిక మందన్నా తన గ్లామర్ మొత్తం చూపించేపనిలో ఉంది. దీనితోడు రష్మిక మందన్నా బ్లాక్ అండ్ వైట్ మోడ్రెన్ అవుట్ ఫిట్ లో కనిపించింది. ఆ డ్రెస్ లో అందాలు అలవోకగా ఆరబోసింది. అది చూసిన ప్రతి ఒక్కరూ అమ్మడుకి బాలీవుడ్ నీళ్లు బాగా వంటబట్టాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read:BRS:బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్

- Advertisement -