నితిన్ సర్.. నా వల్లె మీకు పెళ్లి అవుతుంది

541
nithin Rashmika
- Advertisement -

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నాడు. గత కొద్ది రోజులుగా నితిన్ శాలిని అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్చయించుకున్నారు. వీరి పెళ్లికి ఇరువురి కుటుంబ సభ్యులు ఒకే చెప్పడంతో ఎప్రిల్ వీరి వివాహం జరుగనుంది. అయితే ఇప్పటినుంచే పెళ్లి పనులు ప్రారంభించినట్లు తెలిపాడు నితిన్. పెళ్లి పనుల ఫోటోలను సోషల్ మీడియాలో చేసిన అభిమనులతో పంచుకున్నాడు నితిన్. ఈ ట్వీట్ పై హీరోయిన్ రష్మీక మందన స్పందించింది.

“కంగ్రాచ్యులేషన్స్ నితిన్ సార్! చూడండి, నేను మీకు ఎంత అదృష్టం తీసుకువచ్చానో! మీరు నాతో నటిస్తున్నారో లేదో ఓ ఇంటివారు కాబోతున్నారు. మీ ఇద్దరూ పెళ్లితో ఒక్కటవుతుండడం పట్ల ఎంత సంతోషంగా ఉన్నానో!” అంటూ రష్మిక ట్వీట్ చేసింది. నితిన్ నటించిన భీష్మ సినిమా ఫిబ్రవరి 21న విడుదల కానుంది. వెంకీ కుడుములు దర్శకత్వం వహించిన ఈమూవీలో రష్మీక మందన హీరోయిన్ గా నటించింది. ఎప్రిల్ లో పెళ్లి ఉండటంతో రెండు నెలలు సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు నితిన్.

Rashmika Twitter

- Advertisement -