హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మికి కరెంట్ షాక్‌…!

342
rai laxmi

వెండితెరపై భారీ అందాల భామలుగా క్రేజ్ తెచ్చుకున్న కథానాయికలలో రాయ్ లక్ష్మి ఒకరు. తెలుగు,తమిళ ,మలయాళ,కన్నడ సినిమాలు చేస్తూ తన గ్లామర్‌తో యూత్ మతిపొగొట్టింది. బాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్న రాయ్ లక్ష్మీ జూలీ 2తో ఇంప్రెస్ చేసింది.

అయితే తాజాగా రాయ్ లక్ష్మికి కరెంట్ షాక్ తగిలింది. నిజంగా కాదు. తన ఇంటికి వచ్చిన కరెంట్ బిల్లు చూసి ఈ అందాల బ్యూటీ మతి పోయింది. ఎంతలా అంటే ఒక నెలకు కట్టిన కరెంట్ బిల్ మళ్ళీ ఇంకో నల వచ్చేసరికి డబల్ అవుతుందట. దీంతో విసిగిపోయిన ఈ బ్యూటీ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.

తనను ఈ కష్టం నుంచి గట్టెక్కించాలని వేడుకున్న రాయ్ లక్ష్మి…కష్టపడి సంపాదించి ఇలా డబ్బు కట్టాలంటే ఎలా అంటూ ప్రశ్నించింది. ఎలక్ట్రిసిటీ టోల్ ప్రీ నెంబర్ కి కాల్ చేసిన వాళ్ళు అసలు రెస్పాండ్ కావడం లేదని చెప్పుకొచ్చింది. దీంతో ఎలక్ట్రిసిటీ సిబ్బంది వెంటనే రియాక్ట్ అయ్యారు . మీకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము . త్వరలోనే మీ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.