గ్రీన్ ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన నటి ప్రియాంక..

259
Actress Priyanka
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా యాంకర్ రాధా ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన బుల్లితెర నటి ప్రియాంక (బంగారు కోడలు సీరియల్) నేడు మోతి నగర్‌లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ.. ఆక్సిజన్ అనేది మన మానవ మనుగడకు ఎంతో ముఖ్యమని అలాంటి ఆక్సిజన్ ఇచ్చే మొక్కలను పెంచే బాధ్యత మనందరిపై ఉందన్నారు.

భారతదేశం గ్రీన్‌గా మారాలని హరిత తెలంగాణ కావాలనే ఉద్దేశంతో రాజ్యసభ సభ్యులు సంతోష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అద్భుతంగా ముందుకు పోతుందని.. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా తన సహచర నటులు అనిక, అనుశ్రీ, సంయుక్తలను గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు.

- Advertisement -