నటి ప్రగతి.. లేటు వయసులో ఘాటు అందాలను ఆరబోస్తూ… సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రగతి గురించి తెలియని వారుండరు. జిమ్ లో అదిరిపోయే వర్కవుట్స్ చేస్తూ అదరహో అనిపించే ప్రగతి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయిపోయింది. అత్త, పిన్ని, తల్లి, వదినగా పలు సినిమాల్లో నటించింది. ఈ మధ్య ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాల్లో తనలోని కొత్త యాంగిల్ ను పరిచయం చేస్తూ కామెడీని పండించింది ప్రగతి. సోషల్ మీడియాలో ప్రగతి షేర్ చేసే ఫోటోలు చూస్తే పిచ్చెక్కిపోవడం ఖాయం. అందాలను ఆరబోస్తూ…. లేటు వయసులో కుర్రాళ్లను ఫిదా చేస్తోందనే చెప్పాలి. అయితే ప్రగతి తాజాగా చేసిన కామెంట్స్ తెగ వైరల్ గా మారాయి.
పెళ్లై.. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినా ప్రగతి భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటోంది… అయితే భర్తకు దూరంగానే ఉంటోన్న ఇద్దరు పిల్లలను పెంచి పెద్దవాళ్లను చేసింది ప్రగతి. అయితే ఇటీవల చాలా మంది సీనియర్ నటీనటులు రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన తరుణంలో ప్రగతి కూడా రెండో పెళ్లి చేసుకోబోతోందన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో తన రెండో పెళ్లి వార్తలపై ప్రగతి స్పందించింది. పెళ్లి కన్నా కంపానియన్ అంటే బాగుంటుందని ప్రగతి చెప్పుకొచ్చింది. తనకు సరైన వాళ్లు దొరకడం కష్టమని.. అదీకాక సింగిల్ పర్సన్ దొరకడం ఇంకా కష్టమని.. కానీ రెండో పెళ్లి జరగాలని ఉంటే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పుకొచ్చింది ప్రగతి..