నటి ప్రగతి ఓ స్టార్ నిర్మాతను రెండో పెళ్లి చేసుకోబోతుందని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఆ నిర్మాత ప్రగతిని పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పెట్టారట. చిన్న రిమార్క్ కూడా లేని ఆ ప్రొడ్యూసర్ అలా అడగడంతో ఆమె కూడా ఓకే చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే, తాను రెండో పెళ్లి చేసుకోబోతోందంటూ వచ్చిన వార్తలపై ఆమె స్పందించారు. తనపై వచ్చిన రూమర్స్‌ను తీవ్రంగా ఖండించారు. ఒకవేళ రెండో పెళ్లి చేసుకుంటే.. తానే ముందుగా చెబుతానని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమె తన భర్తతో విడిపోయి.. కూతురుతో కలిసి ఉంటున్నారు.
కాగా, ప్రగతి చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని, భర్తతో విడిపోయిన సంగతి తెలిసిందే. ఆమె తన జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డారు. ప్రస్తుతం సీనియర్ నటిగా ప్రగతి రాణిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె సినిమా ఇండస్ట్రీ పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ”నేను 25 ఏళ్లుగా నటిస్తున్నాను. ఎవరికీ తెలియదు, మొదట్లో నేను హీరోయిన్‌గా కూడా నటించాను. ఇప్పుడు మంచి పాత్రల్లో నటించాలని అనుకుంటున్నా. అయితే ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో 40 ఏళ్లు దాటిన లేడీ యాక్టర్స్‌ని దర్శకులు పక్కన పెట్టేస్తున్నారు. కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్లకు అసలు ప్రాధాన్యం లేకుండా పోయింది” అని ప్రగతి చెప్పుకొచ్చింది.
ప్రగతి ఇంకా మాట్లాడుతూ.. సినిమా నటి అనగానే చాలా మందికి చిన్నచూపు ఉంటుంది. నా పై కూడా ఎందరో ఎన్నో కామెంట్స్ చేశారు. షూటింగ్ సెట్‌లో కొందరు అయితే మాతో అసభ్యంగా కూడా ప్రవర్తిస్తారు. గతంలో ఓ సినిమా షూటింగ్ కోసం గోవా వెళ్లాం. అక్కడ ఓ వ్యక్తి నా చేయి పట్టుకుని రూమ్ లోకి లాగారు. ఈ ఘటనతో నేను ఆ షూటింగ్ నుంచి మధ్యలోనే వచ్చేసాను. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ఆ టీమ్ తెలిపింది. కానీ తర్వాత ఎలాంటి చర్యలు లేవు. ఇది సినిమా ఇండస్ట్రీ పరిస్థితి అని ప్రగతి చెప్పింది.
Also Read:ఓటీటీ : ఈ వారం చిత్రాలివే