దిక్కు లేని స్థితిలో తనను ఆదుకోవాలని సాయం కోసం ఎదురుచూస్తోంది సీనియర్ నటి పావలా శ్యామల. ఆర్థిక పరిస్థితి బాగాలేదని వీడియో ద్వారా వేడుకుంది పావలా శ్యామల.
పెద్ద పెద్ద హీరోలతో యాక్టింగ్ చేశానని …ఇప్పుడు ఏ దిక్కూ లేక ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉన్నానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఎవరైనా దయచేసి ఆదుకోవాలని కోరింది.
శ్యామలను ఆదుకునేందుకు కనిపించలేదు తెలుగు ఫిలిమ్ ఛాంబర్ పెద్దలు. ఆదుకోవాలని కోరిన తెలుగు సినిమా ఫిలిమ్ ఛాంబర్ పెద్దలు కనికరించలేదు. కాస్త రాజకీయాలు దూరం పెట్టి … మొదట ఆ నటికి న్యాయం చేయాలని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.
మాటలకే పరిమితమైంది తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ … కనిపించని మంచు విష్ణు. దిక్కు లేని స్థితిలో తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉందని విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు.
Also Read:ప్రశ్నిస్తే కేసులా..రైతులపై నిందలు సరికాదు?