ఆధునిక సంప్రదాయ ఉత్పత్తి వేదిక… ఇకత్ మేళ !

286
IKAT art Mela
- Advertisement -

అత్యాధునిక సంకేతిక పద్దతులలో నేత కార్మికులు రూపొందించిన హ్యాండ్ లూమ్ ఉత్పత్తుల ప్రదర్శన “పొచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళ 2018” సికింద్రాబాద్‌లోని వెస్ట్ మారేడ్పల్లిలో గల Y.W.C.A హాల్లో కొలువు తీరింది, ఈ కార్యక్రమాన్ని నటి నిత్య శెట్టి ప్రారంభించారు.

IKAT art Mela

“ఈ మేళ లో ఉంచిన వివిధ రకాల డిజైన్ చీరలు, ఇతర హ్యాండ్లూమ్ ఉత్పత్తులు ఎంతో బాగున్నాయి అని నటి నిత్య శెట్టి అన్నారు, ఈ తరహ ఉత్పత్తుల వలన చేనేత కార్మికులు తమ ఉత్పతులకు మరింత ప్రాచుర్యం కల్పించుకునే అవకాశం లబిస్తుంది అని ఆమె అన్నారు”.

IKAT art Mela

పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ డైరెక్టర్లు లవకుమార్ , ఉపేందర్, చైర్మన్ దేవేందర్, సీఈఓ రాజశేఖర్ నాయుడు మాట్లాడుతూ.. ఈ నెల 25 వరకు కొనసాగనున్న ఈ మేళాలో వందలాది రకాల హ్యాండ్లూమ్ దుస్తులు, చీరలు, హోం ఫర్నిషింగ్స్, డ్రెస్ మెటిరియాల్ అందుబాటులో ఉంచామని వారు వివరించారు.

- Advertisement -