మరో బోల్డ్ పాత్రలో నయనతార

33
- Advertisement -

హీరోయిన్ నయనతార మరో గ్లామర్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హీరో ఆర్యతో కలిసి ఆమె ఓ సినిమా చేయబోతుంది. ఈ సినిమాలో ఆమె పాత్ర గ్లామర్ గా ఉంటుందట. గ్లామర్ పాత్రల్లో నటించాలా వద్దా, ఎక్స్‌పోజింగ్ చేయాలా, వద్దా అనేది హీరోయిన్స్ వ్యక్తిగత నిర్ణయం. కానీ, పెళ్లి పిల్లలు పుట్టాక, ఆమె కుటుంబం పై కూడా అది ఆధారపడి ఉంటుంది. సౌత్‌ లో పెళ్లి అయిన తర్వాత హీరోయిన్స్ బోల్డ్‌ గా నటించలేరు. పెళ్లి అవ్వగానే సౌత్‌లో చాలామంది హీరోయిన్స్ నటించడమే మానేస్తారు కూడా. అలాంటిది, ఇప్పుడు నయనతార బోల్డ్ గా నటించబోతుంది.

తన భర్త విగ్నేష్ శివన్ తనను ఎలాంటి పాత్రలో చేయడానికి అయినా ఎంకరేజ్ చేస్తాడని, బోల్డ్ సీన్స్ కూడా చేయమని చెప్తాడని నయనతార ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. నిజానికి గత కొన్ని సినిమాలుగా పెద్దగా బోల్డ్ సినిమాల్లో, సీన్స్‌లో నయనతార నటించలేదు. కానీ, పెళ్లి తర్వాత తన భర్త అలాంటి సీన్స్ చేయడానికి భయం వద్దంటూ ఎంకరేజ్ చేస్తున్నారని బయటపెట్టింది ఈ లేడీ సూపర్ స్టార్. ఆమె ప్రస్తుతం చేస్తున్న మూవీలో చాలా బోల్డ్ సీన్స్, డైలాగ్స్ ఉన్నాయని తను మొదట నటించడానికి ఒప్పుకోలేదట.

ముఖ్యంగా పిల్లలు పుట్టిన తర్వాత ఇలాంటి ఒక సినిమా చేయడం కరెక్ట్ కాదని, ఇలాంటి పాత్ర చేయడానికి తను రెడీగా లేనని మొదట నయనతార మేకర్స్‌కు చెప్పేసిందట. ఆ తర్వాత మళ్లీ తానే ఈ ప్రాజెక్ట్‌ను ఓకే చేసిందట. దాని వెనుక కారణాన్ని నయనతార బయటపెట్టింది. ‘‘నా భర్త ఈ సినిమా చేయమని ఎంకరేజ్ చేశారు. పాత్రకు అవసరమైతే బోల్డ్ సీన్స్‌ను కూడా భయం లేకుండా చేయమన్నారు. అప్పుడు నేను ఆ సినిమాను ఓకే చేసి బోల్డ్ సీన్స్‌లో ఈజీగా నటించగలుగుతున్నాను’ అని నయనతార తెలిపింది.

Also Read:ఈ టైంలో నీళ్లు తాగండి..ఆరోగ్యంగా ఉండండి!

- Advertisement -