గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న నభా నటేష్‌..

160
nabha natesh
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు ప్రముఖ బాలీవుడ్ నటి నబా నటేష్.రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్ఫూర్తిగా తీసుకొని స్వతహాగా ఛాలెంజ్ ను స్వీకరించి నేడు బెంగళూరు లోని తన నివాసంలో మొక్కలు నాటిన ప్రముఖ బాలీవుడ్ నటి నబా నటేష్.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు పచ్చదనం పెంచడం కోసం చాలా చక్కని ఛాలెంజ్ ను చేపట్టారని దీనిని చూసి నేను స్ఫూర్తి పొంది మొక్కలు నాటడం జరిగింది అని తెలిపారు.ఈ చాలెంజ్ అదేవిధంగా కొనసాగాలని అందుకోసం నేను హీరోయిన్లు అనూ ఇమాన్యుల్,నిధి అగర్వాల్,హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

- Advertisement -