సినీ లోకంలో రెండు విషాదాలు

68
- Advertisement -

ప్రపంచ సినీ లోకంలో రెండు విషాదాలు చోటు చేసుకున్నాయి. బాలీవుడ్ వెటరన్ నటుడు హర్ష్ మాగోన్ (76) కన్నుమూశారు. ముంబైలోని తన ఇంట్లో తుది శ్వాస విడిచారు. గోల్ మాల్, నమక్ హలాల్ వంటి హిట్ చిత్రాల్లో ఆయన నటించారు. ఎఫ్‌టీఐఐ నుంచి గ్రాడ్యుయేట్ (1974) పట్టా అందుకున్న ఆయన జుహులో యాక్టింగ్ ఇనిస్టిట్యూట్‌ను నడిపారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. హర్ష్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

అలాగే హాలివుడ్ సీనియర్ నటి మెగ్ జాన్సన్ (86) కూడా కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఆమె నేడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా, హాలివుడ్‌ లో పలు చిత్రాల్లో నటించిన మెగ్ జాన్సన్‌కు ఎమ్మర్డెల్ చిత్రం ద్వారా మంచి గుర్తింపు లభించింది. దీంతో మెగ్ జాన్సన్ మృతిపై హాలివుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Also Read:ప్రాజెక్టు ‘ K’ బ్యాలెన్స్ అయినట్టే!

మా గ్రేట్ తెలంగాణ.కామ్ తరఫున హర్ష్ మాగోన్, మెగ్ జాన్సన్ ల మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

Also Read:త్రివిక్రమ్ – బన్నీ 4వ సారి

- Advertisement -