పెళ్లి ఉండొచ్చు కానీ ధనుష్ తో కాదు

32
- Advertisement -

తన భర్త చనిపోయాక సోలో లైఫ్ లీడ్ చేస్తోంది నటి మీనా. మరీ ముఖ్యంగా ఈ మధ్య ఒంటరితనంతో బాగా ఇబ్బంది పడుతుందట. ఆ ఒంటరితనం నుంచి బయట పడటానికి, ప్రస్తుతం కెరీర్ లో బిజీ అయ్యాను అంటుంది. ఐతే, చిన్న గ్యాప్ కూడా తీసుకుని, ఇండస్ట్రీలోకి రాగానే తన పై పిచ్చి పిచ్చి వార్తలు రాస్తున్నారని మీనా సీరియస్ అవుతుంది. అసలు ఇలాంటి టైమ్ లో ఎవ్వరూ రెండో పెళ్లి ఆలోచన చేయరు. ఇదే విషయాన్ని మీనా పరోక్షంగా వెల్లడించింది. భర్త చనిపోయిన వెంటనే రెండో పెళ్లి చేసుకుని సుఖ పడాలి అని ఏ ఆడది కోరుకోదు.

అదేంటో.. హీరోయిన్లు అంటే చాలు, వాళ్ళు దాని కోసమే ఉంటారు అన్నట్టు చూస్తారు. అలాగే నీచమైన కామెంట్స్ చేస్తారు. ఇంతకీ మీనా ఎందుకు ఇలా రియాక్ట్ అయ్యింది అంటే.. తమిళ హీరో ధనుష్ తో ఆమె ప్రేమలో ఉందని. అంతే కాదు, ధనుష్ పెళ్లి చేసుకోబోతుంది అని తమిళ మీడియాలో పుకార్లు వినిపించాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ కి మీనా చాలా సన్నిహితంగా ఉంటుంది. ఓ దశలో రజనీకాంత్ తో మీనా ప్రేమలో ఉంది అని కూడా వార్తలు వచ్చాయి. మళ్లీ చాలా గ్యాప్ తర్వాత.. ఇప్పుడు రజనీకాంత్ మాజీ అల్లుడితో ప్రేమలో ఉంది అని వార్తలు రావడం మీనాని చాలా బాధ పెట్టినట్టు ఉన్నాయి.

అందుకే, మీనా పై విధంగా సీరియస్ అయ్యింది. ఇక తన రెండో పెళ్లి పై మీనా క్లారిటీ ఇచ్చింది. నా భర్త విద్యాసాగర్ మరణం నన్ను చాలా బాధ పెట్టింది. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయట పడటానికి ప్రయత్నాలు చేస్తున్నాను. ఈ క్రమంలో రెండో పెళ్లి చేసుకోమని నా బంధువులు ఒత్తిడి చేస్తున్నారు. నేను మాత్రం నా కూతురు నైనికా గురించి ఆలోచిస్తున్నాను. ఐతే, తాను రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని తన కుటుంబ సభ్యులకు మీనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఐతే, అందరూ అనుకున్నట్లు ఆ రెండో భర్త హీరో ధనుష్ కాదు, ఎవరు అనేది మీనానే చెప్పాలి.

Also Read:రైతుబంధు ఇప్పట్లో లేనట్లే..?

- Advertisement -