బోల్డ్ రోల్స్ కూడా చేస్తా – మీనా

40
- Advertisement -

బాలనటిగా తెలుగు తెరకు పరిచయమై, హీరోయిన్ గా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న మీనా గత కొన్నాళ్లుగా కెమెరాకు దూరంగా ఉందన్న విషయం తెలిసిందే. అయితే, మలయాళ డైరెక్టర్ జయ జోస్‌‌రాజ్‌ చిత్రంలో నటిస్తున్నట్లు ఆమె ఇన్‌స్టా వేదికగా ప్రకటించారు. త్వరలో ఆమె టాలీవుడ్‌‌కు చెందిన ఓ స్టార్ హీరో సినిమాలో కీలక పాత్రలో నటించేందుకు ఓకే చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి భర్త మరణం తర్వాత మళ్లీ కెమెరా ముందుకు రావడానికి మీనా బాగా ఆసక్తిగా ఉన్నారు. అలాగే ఒంటరి తనం నుంచి బయట పడటానికి ఆమె పలు భాషలను కూడా నేర్చుకోవాలని నిర్ణయించుకున్నారట.

తాజాగా తన తదుపరి హిందీ వెబ్ సిరీస్ కోసం హిందీ భాష నేర్చుకుంటున్నారట. షూట్‌ అనంతరం ఖాళీ సమయంలో హిందీ నేర్చుకోవడంపై ఆమె దృష్టి పెట్టారు. ప్రత్యేకంగా శిక్షణ తరగతుల్లో కూడా మీనా పాల్గొంటున్నారు. తద్వారా త్వరలో హిందీలో తనే స్వయంగా డైలాగులు చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. బాలీవుడ్ లో నటిస్తే తనకు అదనపు రెమ్యునరేషన్ వస్తోందని మీనా భావిస్తోంది. అందుకే.. ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే హిందీలో కొన్ని బోల్డ్ సిరీస్ లు కూడా చేయాల్సి వస్తే నటిస్తాను అంటూ మీనా తన సన్నిహితులతో చెబుతుందట.

Also Read:కుర్ర దర్శకుడి పై తప్పుడు వార్తలు

ఇంతకీ మీనా ఏం చెబుతుందో ఆమె మాటల్లోనే విందాం. ‘న‌టి అన్న‌ప్పుడు ఒక్కోసారి బోల్డ్ గా నటించాల్సి వస్తోంది. గతంలో హీరోయిన్ గా నటించే సమయంలో నేను కొన్ని బోల్డ్ పాత్రలు చేశాను. అయితే, లేటు వయసులో ఘాటు పాత్రలను సౌత్ హీరోయిన్స్ చేయరు. కానీ నార్త్ లో చాలామంది చేస్తున్నారు. అందుకే, నార్త్ లో నేను ఎలాంటి బోల్డ్ రోల్స్ అయినా చేస్తాను. 100% మ‌న‌సు పెట్టి ప‌ని చేస్తాను అంటూ మీనా చెప్పుకొచ్చింది.

Also Read:క్యాబేజీతో ఆరోగ్య ప్రయోజనాలు..!

- Advertisement -