ప్రతి ఒక్కరు మొక్కలు నాటండి: నటి కౌసల్య

564
kadambari kiran
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నేడు అమీర్ పేటలోని సారథి స్టూడియోలో మొక్కలు నాటారు సినీ నటి కౌసల్య.

ఈ సందర్భంగా కౌసల్య మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటే అవకాశం నాకు లభించడం సంతోషకరమని అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం దేశాన్ని పచ్చదనంగా మారుస్తుంది అన్నారు. ప్రతి ఒక్కరు గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో సినిమా నటుడు కాదంబరి కిరణ్,గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కొ ఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.

Actress kousalya plants saplings at Saradi studio

- Advertisement -