అక్కా..అంటూనే హీరోయిన్‌కి ‘ఐలవ్యూ’ చెప్పాడు..!

276
Actress Kajal Aggarwal Counter To Fan For I LOVE YOU
- Advertisement -

టాలీవుడ్‌ బ్యూటీ కాజల్‌ అగర్వాల్‌ కు ఓ అభిమాని షాకిచ్చాడు. అక్కా.. అని పిలుస్తూనే ‘ఐలవ్యూ’ అనేశాడు. ఇటీవల ఓ సినిమా ప్రీ రిలీజ్ వేడుక నిమిత్తం హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమానికి కాజల్ అగర్వాల్ హాజరైంది. ఓ అభిమాని షాకిచ్చాడు…కాజల్ తో మాట్లాడే అవకాశాన్ని కొంతమంది అభిమానులకు చిత్ర యూనిట్ కల్పించిన వేళ ఈ ఘటన జరిగింది.

Actress Kajal Aggarwal Counter To Fan For I LOVE YOU

ఓ ఫ్యాన్ కాజల్ ను ఉద్దేశించి ‘అక్కా’ అని సంబోధించాడు. కాజల్ సహా అక్కడున్న వాళ్లు షాక్ లో ఉండగానే ‘ఐ లవ్ యూ’ అని చెప్పి ఇంకో షాక్ ఇచ్చాడు. దీనిపై స్పందించిన కాజల్ ఓ వైపు ‘అక్కా’ అంటూ, మరోవైపు ‘ఐ లవ్ యూ’ ఎలా చెబుతావని కాజల్ అడుగగా, అక్కడున్న వారందరిలో నవ్వులు విరిశాయి. నాని నిర్మిస్తున్న ‘అ’ సినిమాలో కాజల్ కూడా ఓ పాత్ర చేయగా, ఆ సినిమా ఈవెంట్ లోనే ఈ ఘటన జరిగింది.

- Advertisement -