సినిమా ఇండస్ట్రీ అంటేనే బోలెడు బోల్డ్ విషయాలు ఉంటాయి. అప్పట్లోనే నటీనటుల మధ్య ప్రేమ కహానీలు నడిచాయి. అయితే, కొందరు నటీనటులు తాజాగా వాటి పై స్పందిస్తూ క్లారిటీ ఇస్తున్నారు. దివంగత నటుడు శరత్ బాబును తాను ప్రేమించానని తాజాగా నటి జయలలిత తెలిపింది. ఇద్దరం కలిసి బిడ్డను కనాలనుకున్నట్లు ఆమె ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘ఆయన్ను నేను బావా అని పిలిచేదాన్ని. కలిసి ఎన్నో యాత్రలు చేశాం. ఇప్పుడాయన లేరు కాబట్టి చెబుతున్నా. పెళ్లి చేసుకోవాలనుకున్నాం. బిడ్డను కనాలనుకున్నాం. ఇండస్ట్రీ వాళ్లే ఆపేశారు’ అని నటి జయలలిత తెలిపింది. సుమారు 650కి పైగా సినిమాలు చేసిన జయలలిత ప్రస్తుతం టీవీ సీరియళ్లలో నటిస్తోంది.
మరో సీనియర్ నటుడు మురళీమోహన్ కూడా షాకింగ్ కామెంట్స్ చేశాడు. హీరోయిన్ శ్రీదేవిని తనకిచ్చి పెళ్లి చేయాలని వాళ్ళ అమ్మ అనుకున్నారని మురళీమోహన్ తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే అప్పటికే తనకి వివాహమైందని ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పుకొచ్చారు. తనకి పెళ్లైందన్న విషయం నమ్మని శ్రీదేవి వాళ్ల అమ్మ తన ఇంటికి వచ్చి మరీ చూసి వెళ్లారని అన్నారు. శ్రీదేవి మొదటి సినిమా బంగారక్క అని ఆ సినిమాలో తనతోనే కలిసి శ్రీదేవి నటించిందని మురళీమోహన్ వివరించారు.
అలాగే, నటి జయసుధ ఆ రోజుల్లో తన జీవితంలో జరిగిన విషయాలను ఆమె చెప్పారు. నిర్మాత, తన మాజీ భర్త నితిన్ కపూర్ తో జయసుధ ప్రేమలో పడక ముందు, ఓ హిందీ నిర్మాతతో చాలా చనువుగా ఉండేది అట. పెళ్లి చేసుకుంటానని మూడేళ్లు అతనితో తన చనువును కొనసాగించిందట. అయితే, ఆ తర్వాత ఆ ప్రేమ వర్కౌట్ కాలేదు అని, అంతలో నితిన్ కపూర్ తన జీవితంలోకి రావడంతో అతన్నే పెళ్లి చేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read:Ambati:అంబటి ‘టికెట్’ ఏది ?