సీనియర్ నటి జమున ఇకలేరు..

71
- Advertisement -

టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. సినీ నటి జమునా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని తన నివాసంలో మరణించారు. ఆమె వయస్సు 86.

ఉదయం 11 గంటలకు జమున పార్థివ దేహాన్ని ఫిలిం ఛాంబర్ వద్దకు అభిమానులు, ప్రముఖులు సందర్శనార్థం తరలించనున్నారు. జమున మరణంతో టాలీవుడ్ మరోసారి విషాదంలోకి వెళ్ళింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళి అర్పించారు.

తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 198 సినిమాల్లో నటించారు. 1936, ఆగస్టు 30న హంపీలో జన్మించిన ఆమె.. తన 14వ ఏట 1953లో పుటిల్లు సినామాతో తెరంగేట్రం చేశారు. తెలుగులో రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, జగ్గయ్యవంటి మహామహులతో పోటీపడి నటించారు. గత కొన్నేళ్లుగా వయోభారంతో సినిమాలకి దూరంగా ఉంటున్నా సినీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు జమునా.

ఇవి కూడా చదవండి..

- Advertisement -