‘బిగ్‌బాస్‌’వివాదం: నేనైతే చొక్కా పట్టుకుని నిలదీస్తా..

373
Actress Hema
- Advertisement -

తెలుగులో రెండు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకొని మూడో సీజన్లోకి అడుగిడుతున్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’ని వివాదాలు చుట్టుముట్టాయి. షో ప్రసారం కాకముందే ప్రముఖుల ఆరోపణలు, కేసులతో వార్తల్లో నిలిచింది. బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొనాలంటే ‘సంతృప్తి’ పరచాలంటూ వేధిస్తున్నారని యాంకర్ శ్వేతారెడ్డి, నటి గాయత్రీ గుప్తా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

gayathri and swetha

ఈ నేపథ్యంలో టాలీవుడ్ సీనియర్ నటి హేమ ఘాటు స్పందించించారు. కాస్టింగ్ కౌచ్ వంటి తీవ్రమైన సమస్య బిగ్ బాస్ షోలో ఉంటే హోస్ట్‌గా చేసేందుకు నాగార్జున ఎందుకు ఒప్పుకుంటారని హేమ ప్రశ్నించారు. ఒకవేళ నిర్వాహకులు నిజంగానే అసభ్యకరంగా మాట్లాడి ఉంటే అప్పుడే స్పందించాలి కానీ, నెల రోజుల క్రితం జరిగిందంటూ ఇప్పుడు బయటికొచ్చి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.సెలెక్ట్ కాలేదని తెలిసిన తర్వాత ఇలా చేయడం న్యాయం అనిపించుకోదని వ్యాఖ్యానించారు.

hema

తన విషయంలో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే ఆ రోజే స్పందిస్తానని, అప్పుడే వాళ్ల చొక్కా పట్టుకుని నిలదీస్తానని హేమ స్పష్టం చేశారు. ఒకవేళ బిగ్ బాస్-3లో తనకు అవకాశం కల్పిస్తే తప్పక పాల్గొంటానని, పాలిటిక్స్ లోకి వస్తున్న తనపై ప్రజల్లో ఎలాంటి భావనలు ఉన్నాయో ఈ షో ద్వారా తెలుసుకుంటానని అన్నారు.

- Advertisement -