చిరంజీవికి ధన్యవాదాలుః నటీ హేమ

281
hema
- Advertisement -

కరోనా వైరస్ విభృంభిస్తున్న నేపధ్యంలో సినిమా షూటింగ్ లు ఆగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది చిన్న చిన్న ఆర్టీస్టులకు ఉపాధి కరువయింది. సినీ కార్మికులను ఆదుకునేందుకు కరోనా క్రైసిస్ చారిటీ ని ప్రారంభించారు మెగాస్టార్ చిరంజివి. సినీ ఇండస్ట్రీలో పలువురు ప్రముఖులు తమకు తొచినంతగా సాయం చేశారు. ఆసాయంతో వచ్చిన డబ్బులతో నిత్యావసర సరుకులు కొనుగొలు చేసి సినీ కార్మికులకు పంపిణి చేశారు. ఇలా చేయడం ద్వారా చాలా మంది కార్మికుల ఆకలి తీరింది.

ఈవిషయంపై తాజాగా నటి హేమ మాట్లాడుతూ…సినీ నటులు, కార్మికులను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన సీసీసీ చారీటి చాలా ఉపయోగపడిందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. టాలీవుడ్ కు చెందిన చాలా మంది హీరోలు, దర్శకులు, నిర్మాతలు, ఆర్టీస్టులు తమకు తొచినంతగా సహాయం చేశారని అన్నారు. సీసీసీకి సహాయం చేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సీసీసీ చారిటీ ద్వారా తొలి విడతలో 12వేల మందికి నిత్యావసర సరుకులు పంపిణి చేసినట్లు తెలిపారు. సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభంకాకపోవడంతో రెండవ విడత సహాయం కూడా ప్రారంభించినట్లు తెలిపారు.

- Advertisement -