నేనేం దేవుడిని కాదు…తప్పు చేశా!

15
- Advertisement -

బెంగళూరు రేవ్ పార్టీ సౌత్‌లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ రేవ్ పార్టీలో పలువురు టాలీవుడ్ నటులతో రాజకీయ నాయకుల పుత్రరత్నాలు ఉండటంతో పోలీసులు కూడా సీరియస్‌గా విచారిస్తున్నారు. ఇక ఈ పార్టీలో నటి హేమ ఉందని బెంగళూరు మీడియా కోడై కూయగా తాను తన ఫాం హౌస్‌లో ఉన్నానని ఓ వీడియో రిలీజ్ చేసి అడ్డంగా బుక్కైంది హేమ. ఆ తర్వాత నిర్వహించిన డ్రగ్ టెస్టులో ఆమెకు పాజిటివ్ కూడా వచ్చింది.

ఇక హేమ అంశంలో కరాటే కళ్యాణి ఎంటర్ కాగా ఈ విషయం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా లైవ్‌లో నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇస్తూనే కరాటే కళ్యాణికి కౌంటర్ ఇచ్చింది.

ఎప్పుడు బావుంటాను.. పాజిటివ్ గా ఆలోచించు.. మనసులో ఏం పెట్టుకోకు.. ఎవడైనా ఏమన్నా అంటే ఊరుకోకు.. ఎవతి ఏమన్నా కూడా ఊరుకోకు. మనం తప్పు చేయనంతవరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం తప్పు చేసిన మనమేమి దేవుళ్ళం కాదు అని తెలిపింది హేమ. తప్పు చేసినా, పొరపాటు చేసినా మనస్ఫూర్తిగా సారీ చెప్పొచ్చు. అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఒక అబద్దం చెప్తే దాన్ని కవర్ చేయడానికి వంద అబద్దాలు ఆడాలి. అందుకే 99.99% అబద్దాలు ఆడకుండానే ఉండాలి. నేనెప్పుడూ అబద్దాలు ఆడాను.. అందుకే నేను హ్యాపీగా ఉంటాను అని చెప్పింది.

Alsio Read:Gold Price:లేటెస్ట్ ధరలివే

- Advertisement -