బిగ్ బాస్‌లోకి హీరోయిన్ ఫ్లోరా!

7
- Advertisement -

బిగ్ బాస్ 9 తెలుగు త్వరలో ప్రారంభం కానుంది. ఈ కొత్త సీజన్‌లో పాల్గొనే సెలబ్రిటీల జాబితా రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతోంది.

తాజా సమాచారం ప్రకారం నటి ఫ్లోరా సైనీ ఈ షోలో ఎంట్రీ ఇస్తున్నారని తెలుస్తోంది. పలు సినిమాల్లో నటించి మెప్పించారు ఫ్లోరా. పూరి జగన్నాథ్ దర్శకత్వంలోని 143 సినిమా నుండి మొదలు పెట్టి, ఇటీవలి కాలంలో హిందీలో చేసిన బోల్డ్ వెబ్ సిరీస్‌ల వరకు మెప్పించింది. ఈ షో కోసం ఆమెకు భారీ పారితోషికం చెల్లించినట్లు సమాచారం.

ఫ్లోరా ఎంట్రీతో షోకు గ్లామర్ మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే, ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు కానీ ఒకవేళ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటరైతే ఎంటర్‌టైన్ పక్కా.

Also Read:హైదరాబాద్ మెట్రోకు విద్యుత్ శాఖ షాక్

- Advertisement -