బిగ్ హౌస్‌లోకి వెళ్లనంటున్న నటి..!

53
Bhumika

తెలుగులో అత్యంత పాపులారిటీ ఉన్న షో బిగ్ బాస్‌. ఇప్పటివరకు 4 సీజన్స్‌ పూర్తి చేసుకోగా 5వ సీజన్‌ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాగార్జున 5వ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించనుండగా జూలై 2వ వారంలో షో ప్రారంభంకానుంది. ఇక హిందీలో 14 సీజన్లు పూర్తికాగా 15వ సీజన్‌ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇక ఈసారి 15వ సీజన్‌లో నటి భూమిక ఎంటర్ కానున్నాయని వార్తలు వెలువడుతుండగా స్పందించారు భూమిక. తనకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చిన మాట నిజమేకాని తాను అంగీకరించలేదన్నారు. ఎప్పుడూ బిగ్ బాస్‌ సీజన్‌లోకి ఎంటర్‌కానని తేల్చి చెప్పింది.