- Advertisement -
తనను కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించారు అని పబ్లిక్ గా మీడియా ముందే బహిర్గతపరిచి మలయాళ హీరో దిలీప్ జైలుకు వెళ్ళేదాకా తెచ్చిన హీరొయిన్ భావన. ఈ అమ్మడు ఈనెల 22న పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది నిశ్చితార్థం చేసుకున్న కన్నడ నిర్మాత నవీన్ కు భావనకు త్రిసూర్ లోని ఓ దేవాలయంలో వంద మంది పోలీస్ సెక్యూరిటీ మధ్య నిరాడంబరంగా పెళ్లి జరిగింది.
వీరి వివాహానికి మలయాళ సినీ పరిశ్రమ మొత్తం హాజరయింది. మమ్ముట్టి, మంజు వారియర్, పృథ్విరాజ్, టోవినో థామస్ తదితర ప్రముఖులు పెళ్లికి వచ్చి, నూతన వధూవరులను ఆశీర్వదించారు. తాజాగా పెళ్లి, రిసెప్షన్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను నాలుగున్నర నిమిషాల వీడియోగా రూపొందించి యూట్యూబ్ లో పెట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
- Advertisement -