రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బిగ్ బాస్ 2 ఫేమ్, సింగర్ రోల్ రైడర్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన నటి భాను శ్రీ ఈ రోజు మూడు మొక్కలు నాటడం జరిగింది.
ఈ సందర్భంగా భాను శ్రీ మాట్లాడుతూ.. మొక్కలను నాటి వాటిని రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి అని తెలిపారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు అని. ఈ సందర్భంగా సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆమె ఈ సందర్భంగా మరొక ఐదుగురిని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
ఇందులో 1) సినిమా హీరోయిన్, ఎమ్మెల్యే రోజా 2) ఆర్టిస్టు ప్రియా 3) జబర్దస్త్ చమక్ చంద్ర 4) జబర్దస్త్ గెటప్ శీను 5) జబర్దస్త్ అవినాష్ లను మొక్కలు నాటాలని కొరాది. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు రాఘవ, కిషోర్ పాల్గొన్నారు.
Actress Bhanu Sri accepts Green Challenge from TRS MP Santosh Kumar; plants saplings. On Thursday, the actress planted saplings on the premises of …