మొక్కలు నాటిన ప్రముఖ హీరోయిన్ అర్చన శాస్త్రి..

277
Actress Archana
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా యాంకర్ దీప్తి వాజపేయి విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన ప్రముఖ హీరోయిన్ అర్చన శాస్త్రి ఈ రోజు జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొక్కలు నాటడం చాలా ముఖ్యమని భవిష్యత్ తరాల కోసం మనందరం బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. అందరు కూడా ఏదో ఒక రకంగా మొక్కలు పెంచడం కోసం బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ 17వ తేదీన సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపుణిస్తూ ఈ ఛాలెంజ్ ఇదేవిధంగా కొనసాగాలని అందుకోసం నేను మరొక నలుగురికి ( మధుమిత శివబాలాజీ , నేహా నమన్ షా , ఆశీమ , ప్రాచి )లు కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని హీరోయిన్ అర్చన శాస్త్రి పిలుపునిచ్చారు.

- Advertisement -