గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్..

426
Anupama Parameswaran
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు దక్షిణ భారత సినీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ బాచుపల్లిలో మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జోగినపల్లి సంతోష్ కుమార్ నుంచి ప్రేరణ తీసుకొని హీరో నిఖిల్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటనని అనుపమ పరమేశ్వరన్ తెలిపింది.

అడవులు మరియు పర్యావరణాన్ని కాపాడటానికి ఎంపి సంతోష్ చేసిన అద్భుతమైన ఉద్యమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని తెలిపారు. అనంతరం మరో ముగ్గురుకి సోషల్ వేదిక ద్వారా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ చేస్తానని తెలిపింది. ఈ కార్యక్రమంలో మమత హాస్పిటల్ ఎం.డి డా. పువ్వాడ నయన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -