ట్రాఫిక్ రూల్స్ ప్రతి ఒక్కరు పాటించాలి- హీరోయిన్ అంజలి

227
heroine anjali
- Advertisement -

హైదరాబాద్ ట్రాఫిక్ నిబంధనలపై ఎంజే మార్కెట్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు సిటీ ట్రాఫిక్ పోలీసులు. హైదరాబాద్ ఏంజే మార్కెట్‌లో సిటీ పోలీసులు, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో రూపొందించిన మూడు షార్ట్ ఫిలిమ్ లను సినీ హీరోయిన్ అంజలి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్, అడిషనల్ సిపీ అనిల్ కుమార్, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ట్రాఫిక్ రూల్స్ కి సంబంధించిన మూడు అంశాల్లో షార్ట్ ఫిల్మ్స్ రూపకల్పన చేశారు. ఇందులో తల్లిదండ్రులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్తూ ఒక షార్ట్ ఫిల్మ్,నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్‌, నంబర్ ప్లేట్ మార్చడం, సిగ్నల్ జంపింగ్ మరోకటి..విత్ అవుట్ హెల్మెట్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్‌పై షార్ట్ ఫిల్మ్స్ రూపొందించారు.

ఈ సందర్భంగా హీరోయిన్ అంజలి మాట్లాడుతూ.. నేను ఎల్లప్పుడూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తాను. నా డ్రైవర్‌కి కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించమని చెప్తాను. ట్రాఫిక్ రూల్స్ ప్రతి ఒక్కరు పాటించాలి. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు‌ జరిగి ప్రాణాలు పోవడానికి కారణమవుతోందని అంజలి తెలిపారు. నా డ్రైవర్కి ఎప్పుడు చెప్తూనే ఉంటా..స్లోగా వెళ్ళాలి,సిగ్నల్స్ పాటించాలి,వెకిల్ ఇండికేటర్స్ వేయాలి అని..ప్రతి ఒక్కరు చిన్న చిన్న ట్రాఫిక్ రూల్స్ పాటించక తమ ప్రాణాలు మీదికి తెచ్చుకుంటున్నారు.సిగ్నల్స్ పాటించాలి,హెల్మెట్ పెట్టుకోవాలి,వెకిల్ నడిపేటప్పుడు జాగ్రత్తలు అన్నిపాటించి సేఫ్ గా ఇంటికెళ్లి ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నను అని అంజలి అన్నారు.

హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ , డ్రగ్స్, ఇతర చెడు అలవాట్ల కారణంగా సమాజం ప్రభావితం అవుతుంది.ట్రాఫిక్ రూల్స్ పై అవగాహణ కోసం కార్యక్రమం ఏర్పాటు చేసాము. ప్రతీ రోజు రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది చనిపోతున్నారు.హైవేలపై జరిగే ప్రమాదాలకు అతివేగం కారణమవుతోంది. సినిమాల్లో పోలీసులని విలన్లుగా చూపిస్తున్నారు.. కానీ బయట పోలీసులు నిజమైన హీరోలు.ప్రతీ ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనాలపై ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక అవగాహన కార్యక్రమాలు తీసుకొస్తోంది. మోడోర్న్ టెక్నోలోజిలో అనేక వాహనాలు వస్తున్నాయి. భారత దేశంలో 130కోట్ల జనాభా ఉంది..రోజురోజుకు జనాభా పెరుగుతుంది..అందుకు అనుగుణంగా ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం వెతుకుతున్నాం. ఇలాంటి ఇనిసెటివిటి ప్రోగ్రామ్స్ తీసుకొచ్చిన హైద్రాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ బృందాన్ని అభినందిస్తున్నాను అని సీపీ అన్నారు.

అనిల్ కుమార్(ఆడిసినల్ ట్రాఫిక్ సిపి) మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలు ప్రతిఒక్కరు పాటించేవిధంగా ఒక అవగాహన కల్పించడానికి కొత్త పద్దతిలో షార్ట్ ఫిల్మ్ నిర్మించాం. హైద్రాబాద్ నగరం బెస్ట్ ట్రాఫిక్ సిటిజన్ గా తీర్చి దిద్దే దిశేగా ట్రాఫిక్ నిబంధనలు ఉంటాయి. సిటీజన్స్ ట్రాఫిక్ రూల్స్ ఎప్పటికప్పుడు పాటించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు అవగాహన కల్పించాలి. తల్లిదండ్రులు తప్పు చేస్తే పిల్లలు కూడా తప్పు చేస్తారు. కొంతమంది ట్రాఫిక్ చాలంన్లు పడకుండా నంమ్బెర్ ప్లేట్ తీసి డ్రైవ్ చేస్తున్నారు..ఇది చాలా క్రైం అతుంది అని తెలిపారు.

- Advertisement -