హీరోయిన్ అంజలి అనగానే మనకి గుర్తు వచ్చే రూపం పొడుగా బొద్దుగా ముద్దుగా చక్కగా పదహారణాల తెలుగు అమ్మాయిలా కనిపించే రూపం మనకి గుర్తు వస్తుంది . అంజలి నిజంగానే మన తెలుగు అమ్మాయి అని ఎవ్వరి తెలియదు అందుకు కారణం అంజలి ఎక్కువ సినిమాలు తెలుగులో కంటే కూడా తమిళ్ లో చేయడమే.హార్డ్ వర్క్.. టాలెంట్ తో మోడలింగ్ రంగంలోనూ ఆతర్వాత వెండితెరమీద తానేంటో నిరూపించుకుంది తెలుగమ్మాయి అంజలి. ప్రస్తుతం రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్న అంజలి సోమవారం భారత పార్లమెంటును సందర్శించింది.
జమ్మూకశ్మీర్‌లోని వైష్ణవిదేవి ఆలయ సందర్శన కోసం వెళ్లిన అంజలి తిరుగు ప్రయాణంలో ఢిల్లీకి చేరుకుని పార్లమెంట్ భవనాన్ని సందర్శించింది. అరకు ఎంపీ కొత్తపల్లి గీతతో కలిసి పార్లమెంటు భవనం మొత్తం వీక్షించింది. అంజలి వస్తోందన్న విషయం తెలుకుని ఎంపీ కొత్తపల్లి గీత ఏర్పాట్లు చేసి మరీ ఆమెకు దగ్గరుండి పార్లమెంట్ భవనం మొత్తాన్ని చూపించారు.
పార్లమెంట్ భవనాన్ని కలియతిరిగి ఆవరణలో ఎంపీ గీతతో కలిసి ఫొటోలు దిగి తన ముచ్చట తీర్చుకుంది. రాజకీయాలు అంటే తనకు ఇష్టమేనని ఈ సందర్భంగా అంజలి చెప్పింది. అయితే రాజకీయ ప్రవేశం గురించి ఆమె స్పందించలేదు. వైష్ణవిదేవి దర్శనం కోసం కత్రా నుంచి 13.5 కిలోమీటర్లు త్రికూట పర్వతాల్లో అంజలి కాలినడకన వెళ్లడం గమనార్హం.