ఆమె కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలే!

26
- Advertisement -

సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పై నటీమణులు ఎందరో గళమెత్తారు. ఛాన్స్ కోసం ఒకరు తమ దగ్గర ఉన్నది ఇస్తారు, ఛాన్స్ ఇవ్వడానికి ఇంకొకరు తమకు కావాల్సింది అడుగుతారు, ఇది పక్కా బిజినెస్ థింక్ అని కొందరు బోల్డ్ బ్యూటీలు క్యాస్టింగ్ కౌచ్ గురించి పచ్చిగా మాట్లాడినా.. చాలామంది మాత్రం క్యాస్టింగ్ కౌచ్ కారణంగా ఎంతగానో ఇబ్బందులు పడ్డాం అని, అవకాశాలు కోల్పోయాం అని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఐతే, ఈ క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చింది కాదు. చాలా ఏళ్ల క్రితం నుంచే ఉంది. అందుకే నిదర్శనమే.. పాతికేళ్ల క్రితం తనకు ఎదురైన అనుభవాలను మాజీ హీరోయిన్ ఆమని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

ఆమని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ సినిమా ఆఫీస్ కి వెళ్లినా తన తల్లి వెంట వచ్చేదని ఆమని చెప్పారు. ఐతే, అమ్మ కూడా లేకుండా ఒంటరిగా నన్ను రమ్మన్నే వారు ఉన్నారని, వారి ఉద్దేశం తెలుసుకోవడానికి తనకు కొంత సమయం పట్టిందన్నారు. నాన్న సినిమాల వైపు వెళ్లవద్దని ఎందుకు అన్నారో అప్పుడు అర్థమైందన్నారు. కూతురిగా, చెల్లెలుగా నటించేందుకు ఒప్పుకోలేదని, హీరోయిన్ వేషం సంపాదించుకోవడానికి రెండేళ్ల సమయం పట్టిందని.. ఈ క్రమంలో క్యాస్టింగ్ కౌచ్ ఎలా ఉంటుందో తనకు కూడా పరిచయం అయింది అని ఆమని కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఐతే, ఆమని కామెంట్స్ కి కొందరు నెటిజన్లు మరోలా కామెంట్స్ పెడుతున్నారు. ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారంతో చేసుకునే రొమాన్స్ ను అసలు కాస్టింగ్ కౌచ్ అనడం కరెక్ట్ కాదు అని.. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం దానికి కాస్టింగ్ కౌచ్ అని పేరు పెడుతున్నారు అని పోస్ట్ లు పెడుతున్నారు. మొత్తానికి ఆమని షాకింగ్ కామెంట్స్ చేసింది. నిజానికి ఇండస్ట్రీలో చాలా మంది నటీమణులు తాము కాస్టింగ్ కౌచ్ బాధితులం అని ఇప్పటికే కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -