సోషల్ మీడియాలో తనపై కొంత కాలంగా వస్తున్న వార్తలపై తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది ప్రముఖ నటీ పూనమ్ కౌర్. తనపై అసత్యంగా ప్రచారం చేస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానల్లపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొంతమంది వ్యక్తులు కావాలని తనను కించపరిచే విధంగా పోస్టింగులు పెడుతున్నారని ఆరోపణలు చేసింది.
తన పేరుతో కొంతమంది యూట్యూబ్ లో వీడియో లింకులు పెడుతూ తనను మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారని తన పిటిషన్లో పేర్కొంది. అదే విధంగా తనను మానసికంగా వేధిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది.
ఎలక్షన్ సమయంలో పవన్ కళ్యాణ్ తాను మాట్లాడినట్లు ఫేక్ ఆడియోను సృష్టించి తనను ఇబ్బంది పెట్టారని తెలిపింది. నిందితులను పోలీసులు గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటారనే విశ్వాసం తనకు ఉందన్నారు. తనకు జరిగినట్టు వేరే అమ్మాయికి జరగకూడదని కోరుకుంటున్నానన్నారు.