నటుడు విజయ్ కాంత్‌ కన్నుమూత..

25
- Advertisement -

తమిళ స్టార్ హీరో విజయ్ కాంత్ ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కన్నుమూశారు. కరోనా సోకడంతో ఆయన్ను చెన్నైలో మియోట్ ఆసుపత్రిలో చేర్చగా వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో కన్నుమూశారాని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.

ఓ వైపు సినిమాలు మరోవైపు పాలిటిక్స్ లో సత్తాచాటారు విజయ్ కాంత్. దేశీయ ముర్పొక్కు ద్రవిడ కఝగం పార్టీ చైర్మన్‌గా పనిచేశారు.విరుధచలం, రిషివేందియం శాసనసభ నియోజక వర్గాల నుండి రెండు సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు. 2015లో దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం (DMDK) రాజకీయ పార్టీని స్ధాపించారు. ఆయన మృతితో తమిళనాడు శోకసంద్రంలో మునిగిపోయింది. తమిళ్‌లో వందలాది సినిమాల్లో హీరోగా నటించారు. నటి రోజా భర్త సెల్వమణి దర్శకత్వంలో వచ్చిన కెప్టెన్‌ ప్రభాకర్‌‌ సినిమాతో ఆయన స్టార్ హీరోగా మారారు.

Also Read:Revanth Reddy:ప్రజల వద్దకే పాలన

- Advertisement -