- Advertisement -
బాలీవుడ్ నటి ఊర్మిళ మటోండ్కర్ శివసేనలో చేరనున్నట్లు గత కొన్ని రోజుల నుంచి ఆమెపై ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఊహాగానాలకు ఊర్మిళ తెరదించారు. మంగళవారం ఆమె శివసేన పార్టీలో చేరారు. ముంబైలో ఆ పార్టీ అధ్యక్షుడు, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. ఊర్మిళ గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్ సభ ఎన్నికల బరిలో దిగారు. ముంబయి నార్త్ పార్లమెంటు స్థానంలో పోటీ చేసిన ఆమె ఓటమిపాలయ్యారు. అనంతరం ఆమె కాంగ్రెస్ కు దూరమయ్యారు.
మళ్లీ ఇన్నాళ్లకు ఊర్మిళ శివసేనలో చేరారు. అంతేకాదు గవర్నర్ కోటాలో ఆమెకు ఎమ్మెల్సీ అవకాశం కూడా ఇవ్వబోతున్నారని తాజాగా కథనాలు వచ్చాయి. ఈ విషయాన్ని సీఎం ఉద్ధవ్ థాకరే సన్నిహితుడు హర్షల్ ప్రధాన్ తెలిపినట్టు ఓ జాతీయ మీడియా సంస్థ సోమవారం వెల్లడించింది.
- Advertisement -