నందమూరి తారకరత్న కన్నుమూత..

22
- Advertisement -

టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. నటుడు నందమూరి తారకరత్న కన్నుమూశారు. 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. తారకరత్న అకార మరణంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.

1983లో జన్మించిన తారకరత్న 2002లో ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. లవర్ బాయ్‌గా ఎంట్రీ ఇచ్చిన తారక్‌ తర్వాత విలన్‌గా మారి మెప్పించారు. తర్వాత యువరత్న,తారక్,భద్రాద్రి రాముడు వంటి సినిమాల్లో నటించి మెప్పించారు.

తారకరత్న తండ్రి మోహనకృష్ణ కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే. నటుడిగా సినిమాటోగ్రఫ్‌గా పలు సినిమాలను తెరకెక్కించారు. ఇక తారక్ తన కెరీర్‌లో 20కి పైగా చిత్రాల్లో నటించారు.తారకరత్న చివరిసారిగా సారథి, దేవినేని వంటి పలు చిత్రాల్లో నటించారు.2012లో ప్రేమవివాహం చేసుకున్నారు తారక్. ఆయన భార్య పేరు అలేఖ్యరెడ్డి, ఒక కూతురు ఉన్నారు.

ఇవి కూడా చదవండి…

- Advertisement -