నా నటన చూసి నేనే సిగ్గుపడుతుంటాను- హీరో సూర్య

243
hero surya
- Advertisement -

తమిళ హీరో వరుస సినిమాలో దూసుకుపోతు న్నాడు. ఈ హీరోకి తమిళ్‌తో పాటు తెలగులోనూ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఇటీవల సూర్య న‌టించిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని లేడీ డైరెక్టర్‌ సుధ కొంగర దర్శకత్వంలో రూపొందింది. అయితే ఈ మూవీలో సూర్య నటన ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. అయితే, త‌న న‌ట‌న‌పై తనకే అంత విశ్వాసం ఉండదనీ, తాను న‌టించిన సినిమాలు 100 రోజులు దాటిన త‌ర్వాతే తాను వాటిని చూస్తుంటాన‌ని సూర్య తాజాగా ఓ మీడియా ఛానల్‌తో తెలిపాడు.

తాను 20 ఏళ్లుగా సినిమాలలో నటిస్తున్నప్పటికీ, త‌న సినిమాల విషయంలో విశ్వాసంతో ఉండ‌లేన‌ని తెలిపాడు. ఒకవేళ తాను న‌టించిన‌ సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరిస్తే అది వారి పెద్ద మనసు వ‌ల్లే అని భావిస్తుంటాన‌ని చెప్పాడు. కొన్ని కొన్ని సన్నివేశాలలో త‌న‌ నటన చూసి తానే సిగ్గుపడుతుంటానని చెప్పుకొచ్చాడు. అంతేకాదు త‌న‌ భార్య జ్యోతిక, సోద‌రుడు కార్తి మాత్రం వారు న‌టించిన‌ సినిమాల విషయంలో చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారని సూర్య చెప్పాడు. తాను మాత్రం అలా ఉండలేనని ఈ హీరో వెల్లడించాడు.

- Advertisement -