టాలీవుడ్‌ వల్లే చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు ధైర్యం వ‌చ్చింది: సూర్య‌

159
suriya
- Advertisement -

సూర్య న‌టించిన‌ యాక్షన్ థ్రిల్లర్ ఇటి (ఎవ‌రికీ త‌ల‌వంచ‌డు). పాండిరాజ్ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. టాలీవుడ్ కు చెందిన ప్రముఖ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను విడుదల చేస్తోంది. తమిళ వెర్షన్‌తో పాటు తెలుగులోనూ ఈ చిత్రం మార్చి 10 విడుదల కానుంది.

ఈ సంద‌ర్భంగా గురువారం రాత్రి సూర్య ఇ టీ (ఎవ‌రికీ త‌ల‌వంచ‌డు) ప్రీ రిలీజ్ వేడుక హైద‌రాబాద్ ద‌స్‌ప‌ల్లాలో అభిమానుల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.అమ్మాయిలంటే బ‌ల‌హీనుల‌నుకుంటారు. కానీ బ‌ల‌వంతుల‌ని నిరూపించుకోవాలి.. అంటూ సూర్య సంద‌ర్భానుసారంగా చెప్పే ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్ఇ.టి.` ట్రైల‌ర్‌లో హైలైట్‌. అనంత‌రం సూర్య‌తోపాటు ముఖ్య అతిథిలు మాట్లాడారు.

సూర్య మాట్లాడుతూ, రెండున్న‌రేళ్ళుగా తెలుగు ప్రేక్ష‌కుల‌ను చూడ‌లేక‌పోయాను. నేను ఇక్క‌డ‌కు రావ‌డం హోం టౌన్‌గా భావిస్తాను. సురేష్‌బాబు, బోయ‌పాటి శ్రీ‌ను, గోపీచంద్‌, రానా వీరంద‌రినీ క‌ల‌వ‌డం చాలా హ్యాపీగా వుంది. ఓనాడు ఓ సంద‌ర్భంలో రానాతో కొద్దిసేపు గ‌డిపాను. చ‌క్క‌గా నేను ఇచ్చిన సూచ‌న‌లు విన్నాడు. క‌రోనా మ‌హ మ్మారిని ఎలా ఎదుర్కోవాలో భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చాటి చెప్పింది తెలుగు ప్రేక్ష‌కులే. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌ను చూశాకే ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల‌లో ధైర్యం ఏర్ప‌డింది. దానికి కార‌ణం తెలుగు ప్రేక్ష‌కులు సినిమాపై చూపే ప్రేమ‌, ఆద‌ర‌ణ‌లే. అందువ‌ల్లే అఖండ‌, పుష్ప‌, భీమ్లానాయ‌క్‌.. సినిమాలు తెలుగు సినిమా స్టామినాను ఇండియ‌న్ సినిమాకు రుచి చూపించాయి.నేను కూడా పాండ‌మిక్‌లోనే ఆకాశం నీ హ‌ద్దురా. జైభీమ్ ద్వారా అంద‌రికీ ద‌గ్గ‌ర‌యినందుకు ఆనందంగా వుంది. ఎప్ప‌టిలాగానే తెలుగు ప్రేక్ష‌కులు ఆ సినిమాల‌పై ప్రేమ‌ను చూపించారు. మంచి సినిమాకు హ‌ద్దులు లేవ‌ని తెలియ‌జేసింది. తెలంగాణ‌, ఆంధ్ర అనేవి నా స్వంత ఇంటిలా భావిస్తాను. నేను చేస్తున్న సేవా కార్య‌క్ర‌మాల గురించి అంద‌రూ మాట్లాడుతున్నారు.

నేను స్వ‌చ్చంధ సేవా సంస్థ‌ను ప్రారంభించ‌డానికి స్పూర్తి చిరంజీవిగారే. ర‌క్త‌దాన శిబిరాల‌తో కోట్ల‌మందిలో మార్పును తీసుకువ‌చ్చారాయ‌న‌. అలాంటి మార్పు కొద్ది మందిలో తీసుకువ‌చ్చినా ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని నేను అగ‌రం ఫౌండేష‌న్ స్థాపించా. ఆ సంస్థ నుంచి వ‌చ్చిన తొలి త‌రం 5వేల మంది ఇప్పుడు కాలేజీకి వెళుతున్నారు. క‌ఫ‌ర్ట్ జోన్‌లో వుంటే ఎవ‌రికీ ఎదుగుద‌ల వుండ‌దు. క‌రోనాను మ‌రిచిపోయి హృద‌యం ఏంచెబితే అది చేయండి. అప్పుడే అంద‌రికీ అద్భుత‌మైన భ‌విష్య‌త్ వుంటుంది. ఇక ఇ.టి. సినిమా నాకు స్పెష‌ల్ మూవీ. నేను రామ్ ల‌క్ష్మ‌ణ్‌తో చేసిన ఫైట్స్ బాగా వ‌చ్చాయి. ముఖ్యంగా ఇంట‌ర్‌వెల్ బ్లాక్ అద్భుతంగా వ‌చ్చింది. విన‌య్ చ‌క్క‌టి పెర్ ఫార్మెన్స్ ఇచ్చాడు. ప్రియ అన్ని ఎమోష‌న్స్‌ను బాగా పండించింది. నా తొలి పుట్టిన‌రోజు వేడుక‌కు హాజ‌రైన స‌త్య‌రాజ్ మామ‌తో నేను చేసిన తొలి సినిమా ఇది. ప‌దేళ్ళ త‌ర్వాత ర‌త్న‌వేలుతో క‌లిసి చేస్తున్న సినిమా. ద‌ర్శ‌కుడు పాండిరాజ్‌తోనే నా నిర్మాణ సంస్థ‌ మొద‌లైంది. ఎంతోమంది ప్రత్యేక‌మైన వ్య‌క్తులు ఈ సినిమాలో వున్నారు. కండ‌ల‌తోపాటు హృద‌యం కూడా క‌నిపిస్తుంది. ప్రేక్ష‌కులు గుర్తుపెట్టుకుని ఇంటికి తీసుకువెళ్ళే ఎన్నో విష‌యాలు ఈ సినిమాలో వున్నాయి. అలాగే జానీ మాస్ట‌ర్ నా నుంచి బెస్ట్ డాన్స్ రాబ‌ట్టాడు. ఇ.టి. సినిమా అంద‌రినీ ట‌చ్ చేసే సినిమా. ఈ సినిమాలో ఓ డైలాగ్ వుంటుంది. మీ అంద‌రూ సంతోషంగా వుండాల‌నుకోవ‌డ‌మే నాకు సంతోషం.. ఈ సినిమాకూడా అలాగే సంతోసంగా ఆద‌రించి ప్రేమ‌ను చూపించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

ముఖ్య అతిథి మ‌లినేని గోపీచంద్ మాట్లాడుతూ, సూర్య గురించి చాలా విష‌యాలు చెప్పాలి. నేను ఎవ‌రో తెలీయ‌కుండానే నాకు ఇచ్చిన గౌరవం మ‌ర్చిపోలేను. సూర్య భిన్న‌మైన కాన్సెప్ట్‌ల‌ను ఎంచుకుని చేస్తుంటారు. అందుకే సూర్య చేసిన సినిమాల‌తో తెలుగు వారి లోగిళ్ళ‌లో ద‌గ్గ‌ర‌య్యారు. గ‌జ‌ని, సింగం, ఆకాశ‌మే నీ హ‌ద్దురా, జైభీమ్ వంటి చిత్రాలు ఆయ‌న్నుంచి వ‌చ్చి అద్భుత‌మైన విజ‌యాన్ని చ‌విచూశాయి. నేను ద‌ర్శ‌కుడిని కాక‌ముందు గ‌జ‌ని బ్లాక్ బ‌స్ట‌ర్. సూర్య చేసిన సింగంకు పెద్ద ఫ్యాన్ నేను. నేను కోడైరెక్ట‌ర్ నుంచి ద‌ర్శ‌కుడుగా అవ్వాల‌నుకున్న త‌రుణంలో డాన్ శ్రీ‌ను చేయాల‌నుకుంటున్నా. ఇంకా లైమ్‌లైట్‌లోకి రాలేదు. ఆ స‌మ‌యంలో ఓ సంద‌ర్భంలో లొకేష‌న్ కోసం కార‌కుడి వెళ్ళాను. అక్క‌డ సింగం షూట్ జ‌రుగుతుంది. అప్పుడు అనుష్క‌ను చున్నీతో లాగే యాక్ష‌న్ సీన్ జ‌రుగుతోంది. యాక్ష‌న్‌లో కొత్త‌గా క‌నిపించారు ఆయ‌న నాకు. ఒక‌సారి క‌లుద్దామ‌నుకున్నాను. విష‌యం తెలుసుకుని నేనెవ‌రో తెలియ‌క‌పోయిన నాపై చూపిన ఆద‌ర‌ణ మ‌ర్చిపోలేను. ఇప్పుడు ఇ.టి. ట్రైల‌ర్ చూశాను. అద్భుతంగా వుంది. ర‌త్న‌వేలు విజువ‌ల్స్ బాగున్నాయి. ఈ చిత్ర టీమ్ కు ఆల్ ది బెస్ట్‌. అన్నారు.

- Advertisement -