చిరుపై సీనియర్‌ హీరో సుమన్‌ సంచలన కామెంట్స్‌..

86
suman
- Advertisement -

ఒకప్పుడు టాలీవుడ్‌ యాక్షన్ సినిమాల నుంచి ఫ్యామిలీ హీరోగా గుర్తింపు పొందారు సీనియర్‌ హీరో సుమన్‌. ఇప్పటి సీనియర్ హీరోలకు ఒకప్పుడు అయన గట్టిపోటీ ఇచ్చారు ఆయన. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి మంచి సినిమాలు చేస్తున్న సుమన్ ఇటీవల మెగాస్టార్ చిరంజీవి గురించి సంచలన కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో సుమన్‌ మాట్లాడుతూ నాకు కమలహాసన్ గారు అంటే చాలా ఇష్టం. కానీ డాన్స్ విషయానికొస్తే చిరంజీవిగారి డాన్స్ నచ్చుతుంది.

చిరంజీవిగారు నేల చూడకుండా డాన్స్ చేస్తారు. ఆయన డాన్స్ చేసేటప్పుడు ఆయన బాడీలో ఒక రిథమ్ ఉంటుంది.. ఒక గ్రేస్ ఉంటుంది. చాలా మంది కుర్రాళ్లు ఇప్పుడు అంతకంటే ఫాస్టుగా చేస్తున్నారు. అయితే వాటిలో జిమ్నాస్టిక్స్ ఎక్కువగా ఉంటున్నాయి. చిరంజీవి తరువాత అంత బాగా డాన్స్ చేసే హీరోగా ఎన్టీఆర్ కనిపిస్తాడు” అని చెప్పుకొచ్చారు. ఇక ఇవే కాకుండా ఇండస్ట్రీకి సంబంధించిన చాలా విషయాలు పంచుకున్నారు సుమన్.

- Advertisement -