నేను ప్లే గర్ల్ ని..నాకు పెళ్లి సెట్ కాదుః శ్రీరెడ్డి

371
SRi Reddy
- Advertisement -

క్యాస్టింగ్ కౌచ్ పై తెలుగు ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన శ్రీరెడ్డి ప్రస్తుతం చెన్నైలో నివాసం ఉంటుంది. టాలీవుడ్ లో కొంత మందిపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో వేదికగా రోజు ఎవరోఒకరిపై సెటైర్లు వేస్తూనే ఉంటుంది శ్రీరెడ్డి. ఇక తాజాగా ఫేక్ బుక్ లైవ్ లోకి వచ్చిన ఆమెకు నెటిజన్లు పలు ప్రశ్నలు అడిగారు.

ఈసందర్భంగా ఆమెను పెళ్లి గురించి అడగ్గా నిర్మొహమాటంగా తన అభిప్రాయన్ని ప్రకటించింది. తన మైండ్ సెట్ ప్రకారం పెళ్లి తనకు సెట్ కాదని చెప్పేసింది. తనకు నచ్చినట్టు తన జీవితాన్ని తాను అనుభవించాలనుకుంటున్నానని తేల్చేసింది.

అదే సమయంలో డేటింగ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను డేటింగ్ చేస్తే.. మహా అయితే ఓ ఏడాది అతనితో గడుపుతానని తెలిపింది. ఆ తర్వాత తనకు కొత్త ప్రేమ కావాలని అనిపిస్తుందని ప్రకటించింది. తాను ప్లేగర్ల్ టైప్ అంటూ హాట్ కామెంట్స్ చేసింది.

- Advertisement -