సాగర్ స్వీయ దర్శకత్వంలో ‘కాలం రాసిన కథలు’

33
- Advertisement -

యమ్ యన్ వి సాగర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఆసక్తికరమైన చిత్రం కాలం రాసిన కథలు. ఈ చిత్రం రిలీజ్ డేట్ పోస్టర్ని హీరో శివాజీ గారు విడుదల చేశారు. పోస్టర్ విడుదల చేసిన అనంతరం, శివాజీ గారు మాట్లాడుతూ “ఈ చిత్రం టైటిల్ మరియు కాన్సెప్ట్ చాలా బాగున్నాయి. ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుంది” అని అభిలాషిస్తూ టీమ్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

దర్శక నిర్మాతలు యమ్ యన్ వి సాగర్ సాగర్ మాట్లాడుతూ, “మచిలీపట్నం పెడన పరిసర ప్రాంతాల్లో ఈ చిత్ర సింహ భాగం షూటింగ్ జరిగింది. యూత్ ఫుల్ లవ్ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గారు రూపొందిన మా చిత్రం ద్వారా నూతన నటీనటులు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ముఖ్యంగా ఐదు జంటల మధ్య జరిగే అద్భుతమైన సంఘర్షణలతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే ట్విస్టులు ఈ సినిమాలో ఉన్నాయి. అంతే కాకుండా, సెకండ్ హాఫ్ లో శివుడి మీద ఉండే సన్నివేశాలు ప్రేక్షలులని రక్తి కట్టిస్తాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ మరియు సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం ఆగస్టు 29న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది” అని తెలిపారు.

Also Read:కన్నప్పలో జాయిన్ అయిన మధుబాల

- Advertisement -