కోలివుడ్‌ సూపర్‌స్టార్స్‌పై కట్టప్ప షాకింగ్ కామెంట్స్‌..!

358
- Advertisement -

గత కొద్దికాలంగా రాజకీయాల్లోకి వస్తానంటున్న సూపర్‌స్టార్‌ రజనీకాంత్, పార్టీ పెట్టినా తనదైన ముద్ర వేయలేకపోతున్న విశ్వనటుడు కమలహాసన్‌లపై దక్షిణాది నటుడు సత్యరాజ్(కట్టప్ప) విమర్శలు చేశారు. తమిళనాడులో రాజకీయ శూన్యత ఉందంటూ రజనీ చేయకచేయక ఓ వ్యాఖ్య చేస్తే దానిపై సత్యరాజ్ కౌంటర్ ఇచ్చారు. తమిళనాడులో ఎలాంటి రాజకీయ శూన్యత లేదని ఓటర్లు ఇటీవల జరిగిన ఎన్నికల్లో అది నిరూపించారని బదులిచ్చారు.

Actor Sathyaraj

అలాగే మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధినేత కమల్‌హాసన్‌ వల్ల ఏ ప్రయోజనం, మార్పు ఉండదని ఘాటుగా స్పందించారు. డీఎంకే వంటి పాతుకుపోయిన పార్టీలను పెకిలించాలని అనుకోవడం మూర్ఖత్వమని ఎద్దేవా చేశారు. రాజకీయాలు చేయటానికి తమిళనాట చాలా మంది ఉన్నారని.. ఎవరి పని వారు చూసుకుంటే మంచిదన్నటుగా విమర్శించారు.

స్థానికేతరులు ఇక్కడ రాజకీయాలు చేయాల్సిన అవసరంలేదని కుండబద్దలు కొట్టినట్లు చేప్పారు. రజనీకాంత్ స్థానికతను దృష్టిలో పెట్టుకుని సత్యరాజ్ ఈ కామెంట్ చేసినట్టు అర్థమవుతోంది. తమిళనాడులో ఆరాధ్యదైవంగా వెలుగొందుతున్న రజనీకాంత్ జన్మతః మరాఠీ వ్యక్తి అని తెలిసిందే. మరోవైపు, కమలహాసన్ పైనా కట్టప్ప తనదైన శైలిలో వ్యంగ్యం ప్రదర్శించారు. కొత్తగా పార్టీ పెట్టినవారు కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారని, ఎన్నికల్లో విఫలం అయ్యారని వ్యాఖ్యానించారు.

- Advertisement -