- Advertisement -
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ మూడవ విడత లో భాగంగా నటుడు రాజీవ్ కనకాల విసిరిన చాలెంజ్ స్వీకరించి సారధి స్టూడియో ప్రాంగణంలో మొక్కలు నాటాడు రఘు కారుమంచి.
ఎంపీ సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో తాను భాగస్వామ్యం అయినందుకు ఆనందంగా ఉందని…..మనకు మంచి ఆక్సిజన్ అందాలన్న మనం ఆరోగ్యాంగా ఉండాలన్న చెట్లు ఎంతో అవసరం అన్నారు.
పచ్చదనం ద్వారా పర్యావరణానికి చాలా మేలు జరుగుతుంది.ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలి.ఇందులో భాగస్వామ్యం అవ్వాలి..సినీ హీరో నారా రోహిత్,దర్శకులు సురేందర్ రెడ్డి,వక్కంతం వంశీ ముగ్గురికి గ్రీన్ ఇండియా చాలెంజ్ చాలెంజ్ విసిరారు రఘు కారుమంచి.ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధి సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -