నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్..

5
- Advertisement -

సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గం మైహోం భుజా అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్న పోసానిని ఏపీలోని రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు పోసాని ప్రకటించిన సంగతి తెలిసిందే.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను అరెస్ట్ చేసినట్టు సమాచారం. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు నోటీసులు జారీ చేశారు. క్రైమ్ నంబర్ 65/2025 అండర్ సెక్షన్ 196, 353(2),111 రెడ్ విత్ 3(5) బీఎన్ఎస్ యాక్ట్ 2033 నాన్ బెయిలబుల్ కింద నోటీసు ఇచ్చారు పోలీసులు.

అయితే గతంలో వైఎస్సార్‌సీపీలో పనిచేసిన ఆయన…ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఆ సమయంలో పవన్ కల్యాణ్‌తో పాటూ పలువురు కూటమి నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కానీ పోసాని అరెస్టుకు గల కారణాలు తెలియరాలేదు. ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత రాజకీయాల నుండి తప్పుకున్నారు.

Also Read:రేవంత్‌కు మతిభ్రమించింది: సతీష్ రెడ్డి

- Advertisement -