రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా దర్శకుడు తరుణ్ భాస్కర్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి నేడు ఖాజాగూడలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటాడు యువ నటుడు నవీన్ కూమార్ (అభయ్ భేతిగంటి).
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాక్ డౌన్ సమయంలో ఏదైనా మంచి పని చేసింది ఉంది అంటే నేను ఈ మూడు మొక్కలు నాటడమే. భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించాలంటే మనం అందరం మొక్కలు నాటాలని. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్ అన్నకి కృతజ్ఞతలు తెలిపారు.
నేను మరొక ముగ్గురిని 1) హాస్య నటుడు వెన్నెల కిషోర్ 2) నటుడు రాహుల్ రామకృష్ణ 3) దేత్తడి హారికలను మొక్కలు నాటాలని కోరుతున్నాను అని నవీన్ తెలిపారు. ఈకార్యక్రమంలో గచ్చిబౌలి కార్పొరేటర్ సాయిబాబా; గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ; ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.