జడ్జ్ గా నవదీప్ “అదిరింది”

736
Adirindi Comedy show
- Advertisement -

మెగా బ్రదర్ నాగబాబు జబర్ధస్త్ షో ను వదిలేసిన అనంతరం జీ తెలుగులో అదిరింది అనే పోగ్రామ్ లో జడ్జ్ గా చేస్తున్నాడు. జబర్ధస్త్ షో దర్శకులుగా పనిచేసిన నితిన్ భరత్ లు ఈ షోకు దర్శకత్వం వహిస్తున్నారు. జబర్దస్త్ ప్రారంభంలో టీం లీడర్లుగా చేసిన ధన్ రాజ్, వేణు వండర్స్, తో పాటు చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీలు ఈషో టీం లీడర్లుగా వ్యవహరిస్తున్నారు. గురు, శుక్రవారాల్లో జబర్దస్త్ ప్రసారం అవుతుండటంతో అదిరింది షోను ఆదివారం రాత్రి ప్రసారంచేస్తున్నారు.

ఇక ఈ షోలో జడ్జ్ గా నాగబాబు కొనసాగుతున్నారు. మరో జడ్జ్ గా మొదటి ఎపిసోడ్ లో నాగబాబు కూతురు నిహారిక రాగా..ఆ తర్వాత రాజ్ తరుణ్ చేశాడు. ఇక ఈమధ్య కొత్తగా నవదీప్ మరో జడ్జ్ గా చేస్తున్నాడు. గత మూడు ఎపిసోడ్లకు నవదీప్ జడ్జ్ గా రావడంతో ఇక ఈ షోకు రెండవ జడ్జ్ గా అయన్ను నియమించారు దర్శకులు. పైగా నాగబాబు, నవదీప్ కాంబినేషన్ కూడా సెట్ కావడంతో నవదీప్ ను ఫైనల్ చేశారు జీ తెలుగు యాజమాన్యం. జబర్ధస్త్ షో కు పోటిన త్వరలో అదిరింది షోను కూడా గురు లేదా శుక్రవారంలో ప్రసారం చేస్తామన్నారు నాగబాబు. తప్పకుండా జబర్దస్త్ తమకు పోటీయే అన్నారు.

- Advertisement -