ఎన్టీఆర్‌ తర్వాత పవనే!

16
- Advertisement -

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌పై ప్రశంసలు గుప్పించారు సినీ నటుడు నరేష్. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…తనకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని తెలిపారు. చెన్నైలో ఎదురెదురు ఇళ్లలో ఉండే వాళ్లమని…అప్పటి నుండి పవన్ అంటే ఇష్టమన్నారు. ఇండస్ట్రీలో నుండి చాలామంది రాజకీయాల్లోకి వచ్చారని…కానీ ఎన్టీఆర్ తర్వాత ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అని చెప్పారు.

రాజకీయాల్లోకి పదవులు ఆశీంచి పవన్ రాలేదని…ఆయన రాజకీయాల్లోకి వెళ్లకముందే చాలా డబ్బులు ఇచ్చారన్నారు. జనాలకు ఏదైనా మంచి చేయాలని తాపత్రయం ఉందని… ఎన్టీ రామారావు తరువాత.. అంత దమ్ముతో నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ మాత్రమేనని చెప్పుకొచ్చారు.

సీఎం జగన్ పేరుని ప్రస్తావించకుండానే.. ఇండస్ట్రీని అవమానించారని.. అలాంటి పరిస్థితి మళ్లీ రాకూడదని కోరుకుంటున్నానని అన్నారు. ఇండస్ట్రీని అవమానించిన సందర్భంలో నరేష్.. ఏడ్చేశానని చెప్పారు.

Also Read:కాంగ్రెస్,బీజేపీ మధ్యే పోటీ:కోమటిరెడ్డి

- Advertisement -