‘ఫిదా’.. మస్త్‌.. మస్తుంది !

299
Actor Nani praises Fidaa
- Advertisement -

వ‌రుణ్ తేజ్ హీరోగా శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ `ఫిదా`. స్వ‌తంత్ర్య భావాలున్న ఓ తెలంగాణ అమ్మాయికి, ఎన్నారై యువ‌కుడి మ‌ధ్య జ‌రిగే అంద‌మైన ప్రేమ‌క‌థ‌, కుటుంబ ప‌ర‌మైన భావోద్వేగాలు యువ‌త‌, కుటుంబ‌క‌థా చిత్రాల ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుంటోంది..ఇప్పటికే సాధారణ ప్రేక్షకుడి నుండి ప్రముఖుల వరకు మన్ననలు అందుకున్న ‘ఫిదా’ సినిమాకు నేచురల్‌స్టార్‌ నాని ఫిదా అయిపోయారు.

ఈ చిత్రాన్ని చూసిన ఆయన ట్విటర్‌ లో తెలంగాణ యాసలో ట్వీట్‌ చేశారు. ‘గిప్పుడే ‘ఫిదా’ చూష్నా.. మస్తుగుంది. సాయిపల్లవి మీరు మ్యాజిక్‌ చేశారు. వరుణ్‌తేజ్‌ మీరు పర్‌ఫెక్ట్‌. శేఖర్‌ కమ్ముల మీరు తీసిన సినిమాల్లో నాకు ఇష్టమైన చిత్రమిది’ అని చెప్పారు. నాని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఎం.సి.ఎ’లో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది.

మలయాళంలో 2016లో విడుదలైన కాళి సినిమా ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేయడానికి వస్తోంది సాయి పల్లవి. ఈ సినిమాలో కూడా సాయి పల్లవి డబ్బింగ్ చెబుతుందట. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్‌లో విడుదల కానుంది.

- Advertisement -