సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం..

12
- Advertisement -

సినిమా పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. నటుడు ముకుల్ దేవ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 54. ముకుల్ దేవ్ మరణవార్తను ఆయన సన్నిహితురాలు, నటి దీప్‌శిఖా నాగ్‌పాల్ సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు. అయితే ముకుల్ దేవ్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

కొంతకాలంగా ముకుల్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. సన్ ఆఫ్ సర్దార్ , ఆర్… రాజ్ కుమార్ , జై హో వంటి పలు హిందీ చిత్రాలలో మంచి గుర్తింపు పొందారు. హిందీతో పాటు తెలుగు, పంజాబీ చిత్రాలలో కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. తెలుగులో ప్ర‌భాస్ న‌టించిన ఎక్ నిరంజ‌న్ సినిమాతో పాటు ర‌వితేజ న‌టించిన కృష్ణ సినిమాలో నటిచాడు. చివరిగా ‘అంత్ ది ఎండ్’ అనే హిందీ చిత్రంలో నటించి మెప్పించారు.

Also Read:కవిత లెటర్ పై కేటీఆర్

- Advertisement -