మొక్కలు నాటిన నటుడు మనోజ్ నందం..

173
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్‌ఎంసీ పార్క్ లో మొక్కలు నాటారు సినీ నటుడు మనోజ్ నందం. ఈ సందర్భంగా మనోజ్ నందం మాట్లాడుతూ గ్రీన్ఇండియా చాలెంజ్ చేపట్టి ప్రతి ఒక్కరినీ బాగస్వామ్యం చేస్తున్న ఎంపీ సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటే అవకాశం కలిగినందుకు సంతోషము వ్యక్తం చేశారు. పర్యవరణాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని వీలైనన్ని మొక్కలు నాటాలని కోరారు.అనంతరం తన స్నేహితులు తనీష్,ధనరాజ్, యాంకర్ గీతా భగత్ ముగ్గురికి గ్రీన్ ఇండియా చాలెంజ్ ఇచ్చారు మనోజ్ నందం.

- Advertisement -