టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ ఓ ఈవెంట్‌లో అభిమానులకు ఆలోచింపజేసే సందేశం ఇచ్చారు. రెస్పెక్ట్ (గౌరవం) మరియు రియాల్టీ (వాస్తవం) మధ్య ఉన్న తేడాను తనదైన శైలిలో వివరించారు.
“నా లేటెస్ట్ ఫోన్ చూడండి” అంటూ ఐఫోన్ 17 బ్యాక్ కవర్‌తో ఉన్న ఫోన్‌ను ప్రేక్షకులకు చూపించారు. ఫ్యాన్స్ ఆశ్చర్యంతో చప్పట్లు కొట్టగా, కాసేపటికి ఆ బ్యాక్ కవర్‌ను తీసేశారు. అందులో సాధారణ ఫోన్ ఉండటాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు.
“బయట కనిపించేది ఒకటి, అసలు వాస్తవం మరోటి” అని మనోజ్ చెప్పారు. మనం ఇతరులను వారి బయటి ఆకర్షణ, బ్రాండ్లు, స్టేటస్ ఆధారంగా గౌరవిస్తామని, కానీ అసలు విలువ వ్యక్తిత్వం, నిజాయితీ, కృషిలోనే ఉంటుందని తెలిపారు.
సోషల్ మీడియాలో చూపించే మెరుపుల వెనక ఉన్న వాస్తవాలను గుర్తించి జీవించాలంటూ అభిమానులకు సందేశం ఇచ్చారు. ఈ చిన్న డెమోతోనే పెద్ద జీవిత పాఠం చెప్పిన మనోజ్‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read:NCP:రాజ్యసభకు శరద్ పవార్?

