మంచు మనోజ్..మంచి మనసు

3
- Advertisement -

రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పరిధిలోని నాదర్గుల్ ‘మాతృదేవోభవ’ అనాథ ఆశ్రమాన్ని సినీనటుడు మంచు మనోజ్ సందర్శించారు.ఆశ్రమ నిర్వాహకుడు గిరి సోషల్ మీడియా ద్వారా చేసిన అభ్యర్థనకు స్పందించి మనోజ్ ఈ సందర్శన చేశారు

ఆశ్రమంలోని అనాథల కోసం మంచు మనోజ్ టేబుళ్లు, కుర్చీలను అందజేశారు.సమాజం పట్టించుకోని మతిస్థిమితం లేని వ్యక్తులను చేరదీసి గిరి చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆయన అభినందించారు

మాతృదేవోభవ అనాథ ఆశ్రమానికి ఎల్లవేళలా అండగా ఉంటానని నిర్వాహకుడికి మనోజ్ హామీ ఇచ్చారు.’సెలబ్రిటీతో పునర్జన్మ చాలెంజ్’లో భాగంగా మలక్‌పేట్ రోడ్డుపై పిచ్చోడిలా తిరుగుతున్న ఒక వ్యక్తిని ఆశ్రమానికి తీసుకొచ్చారు. మంచు మనోజ్ స్వయంగా ఆ వ్యక్తికి జుట్టు, గడ్డం కత్తిరింపజేసి, నూతన వస్త్రాలు, భోజనం అందించి సాధారణ మనిషిగా మార్చారు.

Also Read:టెక్నాలజీ యుగంలో జాప్యమా?

- Advertisement -